అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. కాలిఫోర్నియాలోని హాఫ్‌మూన్ బే ప్రాంతంలో దుండగులు రెండుచోట్ల కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, మరికొంతమందికి గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల మాంటేరీ పార్క్ వద్ద జరిగిన కాల్పుల్లో 10 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa