ఏపీ ప్రభుత్వం వచ్చే నెలలో వైఎస్సార్ చేదోడు పథకం కింద మూడో విడత సాయాన్ని అందించనుంది. ఈ పథకం కింద దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే లబ్ధిదారుల నుంచి ఈ కేవైసీ చేయాలని గ్రామ/వార్డు సచివాలయాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు లబ్ధిదారులు నిర్దేశిత వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారా అనే వివరాలను సేకరిస్తోంది.