పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగనన్నకే సాధ్యమని మంత్రి ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు. శెట్టూరు మండల పరిధిలోని బసంపల్లి గ్రామంలో మంగళవారం"గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ పాల్గొన్నారు. మంత్రి ప్రతి గడపకు తిరిగుతూ సమస్యలు తెలుసుకుంటూ ముఖ్యమంత్రి వై. యస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తూ ప్రతి లబ్ధిదారులకు పథకాల కరపత్రాలను అందజేశారు. వైసిపి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.