ఏపీతో పాటు సీఎం జగన్‌పై కేంద్ర మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రమాదకర పరిస్థితుల్లో ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం అతి తక్కువ సమయంలోనే ప్రజాదరణ కోల్పోయిందన్నారు. గుడ్ గవర్నెన్స్ ఇవ్వడంలో సీఎం జగన్ విఫలమయ్యారన్నారు. కేంద్ర నిధులు సద్వినియోగం చేసుకోవడంలో జగన్ సమర్ధుడు కాదన్నారు. సర్పంచులు తనకు వినతిపత్రాలు ఇచ్చారని దేవుసిన్హ్ తెలిపారు. గ్రామీణ అభివృద్ధికి 14,15 ప్రణాళిక సంఘం నిధులు వేరే మార్గంలో ప్రభుత్వం వాడుకుందన్నారు. ఇది గ్రామ స్వరాజ్యంపై దాడిగా అభివర్ణించారు. ఇంకా దేవు సిన్హ్ మాట్లాడుతూ.. ‘‘పంచాయతీలకు ఇచ్చే నిధులు గ్రామాల అభివృద్ధికి వినియోగించాలి. రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లు, సిబ్బంది జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారు. వలంటీలర్లకు ప్రభుత్వ నిధులు పంచుతున్నారు. వలంటీర్లను కేవలం ఇతర పార్టీలను అణచి వేసేందుకు వాడుతున్నారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ఒక్క సీటు కూడా రాదు. 20 లక్షల గృహాలను కేంద్రం ఏపీకి మంజూరు చేసింది. ఇక్కడ చూస్తే ఒక్క ఇల్లు కూడా నిర్మించడం లేదు. ఏపీ ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిగా లేరు. ఆయుష్మాన్ కార్డులను పేదలకు ఇవ్వడం లేదు’’ అని పేర్కొన్నారు