రాజస్థాన్ లోని జైపూర్ లో గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని ఈ-ఆటో రిక్షాలో తరలించడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆదివారం ఓ ఆస్పత్రి వద్ద యువకుని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఈ-రిక్షాలో తరలించారు. మృతదేహాన్ని అలా చూసిన మిగిలిన వాహనదారులు షాక్ అయ్యారు. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.