యూపీఐ పెమెంట్స్ ఎంత సులభతరంగా మారాయో అందరికీ తెలిసిందే. తాజాగా అలాంటి సేవలందిస్తున్న యాప్ లలో టాప్-10 డౌన్ లోడెడ్ యాప్స్ లో మన దేశంలోని ఆ రెండు యాప్ లకు స్థానం దక్కింది. మన పేమెంట్ యాప్స్ మరింత మంది యూజర్లకు చేరువ అవుతూ రికార్డులు సృష్టిస్తున్నాయి. ప్రముఖ ఫిన్ టెక్, పేమెంట్ యాప్స్ అయిన ఫోన్ పే, పేటీఎం 2022 సంవత్సరంలో ఎక్కువ మంది డౌన్ లోడ్ చేసుకున్న యాప్స్ గా నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా టాప్-10 డౌన్ లోడెడ్ యాప్స్ లో ఇవి ఉండడం గమనార్హం. ‘డేటా డాట్ ఏఐ’ అనే సంస్థ ‘స్టేట్ ఆఫ్ మొబైల్ 2023’ పేరుతో నివేదిక విడుదల చేసింది.
మన దేశంలో స్మార్ట్ ఫోన్ యూజర్ల సంఖ్య భారీగానే ఉంది. దీంతో మన దేశంలో పెరిగిపోతున్న డిజిటల్ లావాదేవీలకు ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయి. ఫోన్ పే, పేటీఎం ప్రపంచంలో టాప్ 2గా ఉంటే, మూడో స్థానంలో గూగుల్ పే నిలిచింది. మొబైల్ బ్యాంకింగ్, డిజిటల్ వ్యాలెట్, పేమెంట్, పర్సనల్ లోన్స్ 2022లో ఎంతో వేగంగా వృద్ధి చెందినట్టు ఈ నివేదిక తెలిపింది. ఇక టాప్-10 డౌన్ లోడెడ్ యాప్స్ లో నాలుగో స్థానంలో బజాజ్ ఫిన్ సర్వ్, యోనో ఎస్ బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా వరల్డ్, క్రెడిట్ బీ, ధని, నవీ, గ్రో యాప్స్ ఉన్నాయి. చౌక టెక్నాలజీ ఆధారిత స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోదా టాప్ -10లో లేకపోవడం గమనార్హం.