ఢిల్లీ మేయర్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. ఓటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఆప్, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం జరగ్గా గందరగోళం నెలకొంది. దీంతో రెండోసారి ఎన్నికలు లేకుండానే సభ వాయిదా పడింది. ఎన్నిక జరిగే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ప్రిసైడింగ్ అధికారి సత్యశర్మ తెలిపారు. అంతకు ముందు ఆప్ నేతల నినాదాల మధ్యే డీఎంసీ కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం జరిగింది.