మంగళవారం మధ్యాహ్నం రాజధాని నగరం లక్నోలో భూకంపం కారణంగా వారి నివాస భవనం కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు మరియు పలువురు గాయపడ్డారు.ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ ధృవీకరించారు. రాష్ట్ర రాజధానిలో మధ్యాహ్నం ప్రకంపనలు రావడంతో భవనం పాక్షికంగా కుప్పకూలిన సంఘటన వజీర్ హసంగంజ్ రోడ్డులో జరిగింది.పోలీసులు, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు