ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రేమ పెళ్లి చేసుకొందని...కోర్టు ఆవరణలోనే కల్చిచంపిన తండ్రి

international |  Suryaa Desk  | Published : Wed, Jan 25, 2023, 12:09 AM

పాకిస్తాన్ లో ఇటీవల పరువు హత్యలు విపరతీతంగా పెరిగిపోయాయి. అనేక కథనాలు మీడియాలో వస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనయే ఒకటి చోటు చేసుకొంది. తన ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్న కుమార్తెను ఓ తండ్రి కోర్టులోనే కాల్చి చంపాడు. ఓడరేవు నగరమైన కరాచీలో జరిగిందీ ఘటన. నగరంలోని పిరాబాద్‌కు చెందిన యువతి తల్లిదండ్రులను ఎదిరించి తన ఇష్టపూర్వకంగా ఓ యువకుడిని వివాహం చేసుకుంది. ఈ క్రమంలో తన వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు కరాచీ సిటీ కోర్టుకు హాజరైంది.


బాధితురాలు ఇటీవల ఓ వైద్యుడిని వివాహం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వాంగ్మూలం ఇచ్చేందుకు కోర్టుకు వచ్చిన సమయంలో ఆమె తండ్రి కాల్పులు జరిపాడని, తీవ్రంగా గాయపడిన యువతి కోర్టు హాలులోనే మరణించినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ పోలీసు ప్రాణాలతో బయటపడినట్టు చెప్పారు. 


వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. దేశంలో జరుగుతున్న పరువు హత్యల వెనక తండ్రి, భర్త, సోదరుడు లేదంటే మరో కుటుంబ సభ్యుడో ఉంటున్నట్టు పోలీసులు వివరించారు. తాజా ఘటనలో యువతి తన ఇష్టప్రకారం పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోయిందని, తండ్రి ఆగ్రహానికి అదే కారణమని పేర్కొన్నారు. 


పరువు పేరుతో పాకిస్థాన్‌లో ప్రతి సంవత్సరం వందలాదిమంది మహిళలు హత్యకు గురవుతున్నారు. పాకిస్థాన్ మానవహక్కుల సంస్థ (హెచ్ఆర్‌సీపీ) ప్రకారం.. గత దశాబ్ద కాలంలో ఏడాదికి సగటున 650 పరువు హత్యలు జరిగాయి. వెలుగులోకి రాని వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com