సర్వేపల్లి నియోజకవర్గంలో జగనన్న ఇళ్లు మంజూరైన గిరిజనులకు మరింత అండగా నిలవాలనే లక్ష్యంతో, వారి ఇళ్ల నిర్మాణాలకు అదనపు సాయంగా సిఎస్ఆర్ నిధులను అందించేందుకు అనేక పరిశ్రమల యాజమాన్యాలు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఎస్టీ లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలకు అదనపు సాయంగా సిఎస్ఆర్ గ్రాంట్స్ కింద ఇమామి కంపెనీవారు రూ. 20 లక్షలు, సంతోషిమాత, కిసాన్ క్రాఫ్ట్ కంపెనీల వారు చెరో 10 లక్షలు మొత్తం రూ. 40 లక్షల విలువైన చెక్కులను, అంగీకార పత్రాలను మంత్రికి అందజేశారు.