గుంటూరు జిల్లాలో, డాక్టర్ వైయస్సార్ గ్రామీణ ఆరోగ్య కేంద్రాలలో ఖాళీగా ఉన్న ఎం. ఎల్. హెచ్. పి, సి. హెచ్. వో లా నియమకానికి మంగళవారం గుంటూరులో కౌన్సిలింగ్ నిర్వహించారు. మొత్తం 36 పోస్టులు భర్తీ చేసేందుకు అభ్యర్థులను పిలవగా 26 మంది మాత్రమే ధ్రువ పత్రాలు పరిశీలనకు హాజరయ్యారు. అర్హులైన వారికి ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు నియామక పత్రాలు అందజేశారు.