మైనారిటీ వర్గాల్లోని పేద విద్యార్థులకు అందించే జాతీయ ఉపకార వేతన పథకం (ప్రీ మెట్రిక్)ను కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. ఫలితంగా కొందరు విద్యార్థులు ఆందోళన చెందు తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1-8వ తరగతులు చదివే విద్యార్థులకు ఏడాదికి రూ.1000, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 1-5 తరగతుల విద్యార్థులకు రూ.1000, 6-10వ తరగతి వరకు రూ.5 వేలు అందించేవారు. ప్రస్తుతం 1-8వ తరగతుల విద్యార్థులకు పథకాన్ని రద్దు చేశారు. 9, 10వ తరగతి విద్యార్థులకే కొనసాగనుంది. విద్యా సంవత్సరం సగం పూర్తయిన తరు ణంలో ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేయడంతో జిల్లాలో వేలాది మంది విద్యార్థులు ఉపకార వేతనానికి దూరమయ్యారు.