ముఖానికి ముసుగు ధరించిన ఇద్దరు దుండగులు గుడిలోకి ప్రవేశించి చోరీ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కన్నౌజ్ జిల్లాలోని తిర్వా పట్టణంలో ఈ నెల 23న జరిగింది. పట్టణానికి సమీపంలో ఉన్న ఆలయంలో దొంగతనానికి సంబంధించిన ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇద్దరు వ్యక్తులు గుడి తాళం పగులగొట్టారు. అమ్మవారి విగ్రహం ముందు చేతులు జోడించి నమస్కరించారు. అనంతరం బంగారం, వెండిని అపహరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa