గురువారం 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని నంద్యాల డివిజన్ దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు, ఐ. ఎం. ఏ. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ గావించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ భారతదేశం తన రాజ్యాంగాన్ని 26 జనవరి 1950న పొందిందని, ఆ రోజునుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని దీనితో భారతదేశం సార్వభౌమ రాజ్యంగా మారిందని, రాజ్యాంగ ముసాయిదా కమిటీకి డాక్టర్ బీ. ఆర్ అంబేద్కర్ దానికి అధ్యక్షత వహించి రిపబ్లిక్ ప్రకటించారని కాబట్టి జనవరి 26 రోజున గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణయ్య, సుబ్బారెడ్డి, వెంకట్రావు, మురళి, మధు డాక్టర్లు జఫ్రుల్లా, మధుసూదన్ రెడ్డి, ఫనిల్ , శ్రీనివాసరావు దీపక్ కుమార్, వసుధరాణి , మాధవి, నర్మదా పాల్గొన్నారు.