జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఎటువంటి అతుకు లేకుండా సుమారు 0. 100 మిల్లీగ్రాముల బంగారం గ్రాముల బంగారాన్ని పలుచటి బంగారపు రేకుపై తయారు చేసినట్లుగా కళాకారులు తెలియజేశారు. సుమారు ఒక సెంటీమీటర్ ఎత్తు, ఒక సెంటీమీటర్ వెడల్పుతో భారత దేశపు చిత్రపటాన్ని మరియు అశోక చక్రం తయారు చేశారు. దీని తయారీకి సుమారు గంట సమయం పట్టినట్లుగా తెలియజేశారు. దీని మధ్యలో ఉన్న అశోక చక్రంలో సుమారు 26 గీతలు ఉన్నట్లుగా తెలియజేశారు. తయారు చేసిన వారు శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కాశిబుగ్గ మున్సిపాలిటీ 21 వ వార్డు అవతార్ మెహెర్ నగర్ లో నివాసం ఉంటున్న ప్రముఖ సూక్ష్మ కళాకారులు కొత్తపల్లి రమేష్, ఆచారి రమేష్ తన దేశభక్తిని తన మైక్రో కళారూపం ద్వారా తెలియజేశారు. రమేష్ కళాఖండాన్ని చూసిన పలువురు రమేష్ ని ప్రశంసించారు.