ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. రాజధానికి సంబంధించి శివరామకృష్ణ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. రాజధాని విషయంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇదే అంశంపై అమరావతి రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు కలిసి విచారించే అవకాశం ఉంది. జనవరి 31న విచారణ జరగనుంది.