ఆగ్నేయ బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడనుంది. ఈ అల్పపీడన ప్రభావంతో ఈ నెల 29, 30 తేదీల్లో దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతల క్షీణత కొనసాగుతోంది. ఏజెన్సీ ఏరియాతో పాటు రాయలసీమలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 4 నుంచి 12 డిగ్రీల వరకు రికార్డవుతున్నాయి.