యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహాస్వామి దేవస్థానంలోని పాత గుట్ట దేవస్థానంలో ఈ నెల 31వ తేదీ నుంచి వచ్చే నెల 06వ తేది వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాట్లు ప్రారంభం పూర్తి చేశారు. 31వ తేది మంగళవారం ఉదయం 9గంటలకు స్వస్తివాచనం, విశ్వక్సెనా ఆరాధనం, రాక్షబంధనం, సాయంత్రం 6గంటలకు మృత్సంగ్ర హణం, అంకురార్పణం, 1వ తేదీ ధ్వజారోహనం, వేదపారాయణం, సాయంత్రం, బేరి పూజ, దేవతాహ్వానం, రెండవ తేదీ నుంచి అలంకార సేవలు ప్రారంభం, ఉదయం హవనం, సింహ వాహనం, సాయంత్రం 6 గంటలకు ఎదుర్కోలు మహోత్సవము, హవనము, అశ్వవాహన సేవ 3వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు హవనము, తిరుమంజన ఉత్సవము, హనుమంత వాహన సేవ సాయంత్రం 6 గంటలకు హవనము, ఏడు గంటలకు తిరు కళ్యాణ మహోత్సవము, గజవాహన సేవ. నాలుగవ తేదీ ఉదయం 8 గంటలకు హవనము గరుడ వాహన సేవ, సాయంత్రం 6 గంటలకు రదంగా హెూమము రాత్రి8 గంటలకు దివ్య విమాన రథోత్సవము. ఐదవ తేదీ ఉదయము 10 గంటలకు మహా పూర్ణాహుతి మధ్యాహ్నం 12 గంటలకు చక్ర తీర్థ స్థానం, సాయంత్రం 6 గంటలకు దేవతా ఉద్వాసన పుష్పయాగము డోలారోహణం. పార్వతి ఉదయం 10 గంటలకు స్వామి అమ్మవార్లకు శతకటాభిషేకం. మధ్యాహ్నం ఒంటిగంటకు మహదాశీర్వచనము పండిత సన్మానం జరుగుతుంది.