విశాఖ డెయిరీ చైర్మన్ గా ఎన్నికైన ఆడారి ఆనంద్ కుమార్ ను శుక్రవారం పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కలిసి, ఆయన్ని ఘనంగా సత్కరించారు. ఆనంద్ నేతృత్వంలో విశాఖ డెయిరీ మరింత ముందుకు దూసుకుపోతోందని ఎమ్మెల్యే బాబూరావు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా డెయిరీ చైర్మన్ ఆనంద్ మాట్లాడుతూ తన తండ్రి దివంగత తులసీరావు ఆశయాల మేరకు పాడి రైతుల సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట రెడ్డి రామకృష్ణ వున్నారు.