పంటలు కాపాడుకోవడానికి రైతులు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. చేనుకు కంచెగా రంగురంగుల చీరలను ఉపయోగిస్తున్నారు. కందుకూరు మండలం మాచవరం, గోపాలపురం, పాలూరు తదితరు గ్రామాలకు చెందిన రైతులు మిరప, వేరుశనగ, శెనగ పంటల పొలాలకు కంచెగా రంగురంగుల చీరలను ఉపయోగి స్తున్నారు. అడవి పందుల బెడద ఎక్కువగా ఉండడంతో రైతుల కంటికి కునుకు లేకుండా రాత్రి, పగలు పంట పొలాల వద్దనే కాపలా కాస్తున్నారు. పందుల బారి నుండి పంట పొలాలను రక్షించుకునేందుకు పొలం చుట్టూ పాత చీరలను కడుతున్నారు.