ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలను అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పథకాల కింద ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష, కులాంతర వివాహమైతే రూ.1.20 లక్షలు, బీసీలకు రూ.50 వేలు, బీసీ కులాంతర వివాహం రూ.75 వేలు, మైనారిటీలకు రూ.లక్ష, దివ్యాంగులు రూ.1.50 లక్షలు, భవన నిర్మాణ కార్మికులకు రూ.40 వేలు రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది.