వేలమంది కార్మికులు ఆదారపడి జీవించే ఫ్లెక్సీ బ్యానర్లపై ఎటువంటి ముందుచూపు లేకుండా నిషేధం విధించడం రాష్ట్ర ప్రభుత్వ దుందడుగు చర్య అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కురుపాం నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజు అన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సింగల్ యూజ్ ప్లాస్టిక్ బ్యానర్ల కే ప్రభుత్వం ఉత్తర్వులు వర్తిస్తాయని, పీవీసి ప్లెక్సీలపై జోక్యం చేసుకోవద్దని హై కోర్టు చెప్పినా మొండివైఖరితో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారిస్తుందని అన్నారు. ఎటువంటి అధ్యయనం చేయకుండా, సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది కార్మికుల జీవనోపాధి గురించి ఆలోచన చేయకుండా, కోర్టుల ఆదేశాలను గౌరవించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుందని ప్రశ్నించారు. లక్షల రూపాయలు బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని, అద్దెకు భవనాలు తీసుకొని, ప్రింటింగ్ మిషన్, పేపర్స్ కొనుగోలు చేసి ఫ్లెక్సీల ప్రింటింగ్ ద్వారా బ్రతుకుతున్న వీరిపై ఇంత అనాగరికంగా ఎందుకు నిర్ణయం తీసుకున్నారని అడిగారు. తొందరపాటు నిర్ణయం వలన లక్షల మంది కార్మికుల బ్రతుకులు రోడ్డున పడతాయని, బ్యాంకుల రుణాలు వడ్డీతో సహా పెరిగి అధికమైన భారం పడుతుందని అన్నారు. ఉపాధి అవకాశాలను అందించాల్సిన ప్రభుత్వమే ఇలా రోడ్డున పడేస్తే వీరిమీద ఆధారపడి జీవించే కుటుంబాలు ఏమవుతాయని గంటా నూకరాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పీవీసి ప్లెక్సీల వలన పర్యావరనానికి ముప్పు కాదని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తోనే ప్రమాదమని ప్రభుత్వానికి నివేదించినా ఎందుకు ఇలా వ్యవహరిస్తుందో ప్రభుత్వం పునరాలోచన చేయాలని ప్లెక్సీ కార్మికుల తరపున గంటా నూకరాజు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసారు.