ఇసుక, మద్యం, పేకాట వంటి గేమింగ్, టౌన్ న్యూసెన్స్ కేసులు బహిరంగ మద్యపానం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున‍్న పలువుర్ని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు విశాఖ పరిధిలో పలు చోట్ల పోలీసులు దాడులు నిర్వహించారు. భీమునిపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో గేమింగ్ యాక్ట్ కింద ఒక కేసు నమోదు చేసి 8 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి 1, 22, 100 రూపాయలు సీజ్ చేశారు. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో గేమింగ్ యాక్ట్ నందు ఒక కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్టు చేశారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో లా అండ్ ఆర్డర్ మరియు క్రైమ్ బీట్స్ మరియు మొబైల్స్ తో గస్తీ నిర్వహించి 271 వెహికల్‌్సను తనిఖీ చేశారు. 95 మందిపై టౌన్ న్యూసెన్స్ కేసులు నమోదు చేశారు.
సెబీ అధికారులు దాడులు నిర్వహించి ఒకరిని అరెస్ట్ చేసి 6 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజాశాంతికి భంగం కలిగించిన 35 మందిపై కేసులు నమోదు చేశారు. నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కింద 19 కేసులు నమోదు చేశారు. ఎం. వి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 1074 కేసులు నమోదు చేశారు. ఆటో వయోలెన్స్ కేసులు 142 నమోదు చేశారు.