పాదయాత్ర చేపట్టడానికి నాకున్న అర్హతల గురించి మంత్రులు ప్రశ్నించారు. నేను పంచాయతీరాజ్ మంత్రిగా 25 వేల కిలోమీటర్ల నిడివితో సిమెంట్ రోడ్లు వేయించాను. పల్లెల్లో 25 లక్షల వీధి దీపాలు ఏర్పాటు చేయించా. 25 వేల కోట్లతో ఇంటింటికీ కుళాయిల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాను. ఐటీ మంత్రిగా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేసి రాష్ట్రంలో 80 వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించా. ఇవే నా అర్హతలు. మరి... మీరేం చేశారు? అని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ మాట్లాడారు.