తల్లి కూతుర్లపై దాడి చేసి, కులం పేరుతో దూషించి వారి ఇంటిని నేలమట్టం చేసిన 8 మందికి మూడేళ్లు జైలు శిక్ష 1. 20 లక్షలు జరిమానా విధిస్తూ, గుంటూరు జిల్లా ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జీ రామ్ గోపాల్ శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం నేరస్తుడు ఇంటిని అమ్మాలని ఒత్తిడి చేయసాగాడు. దీనికి వారు ఒప్పుకోకపోవటంతో వారిని కులం పేరుతో దూషించి అక్రమంగా వారు ఉన్న ఇంటిని కూల్చివేయడం జరిగిందన్నారు.