రాష్ట్రవ్యాప్తంగా 50 ఎరువుల దుకాణాలు, 24 పురుగు మందుల దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఎరువులు, పురుగు మందుల నిల్వల్లో వ్యత్యాసాలున్న దుకాణాలపై 6ఏ సెక్షన్ కింద 14కేసులు నమోదు చేశారు. రూ.21.05లక్షల విలువైన 170.64టన్నుల ఎరువులు, రూ.63,690 విలువైన 69.69లీటర్ల పురుగు మందులను సీజ్ చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు.