అధికారం చేతిలో ఉంటే నాలుగు మంచి పనులు చేసి జనం హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోవాలనుకుంటారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకున్నా సరే సొంత నిధులు వెచ్చించి అయినా అభివృద్ధి పనుల్లో తమ ముద్ర ఉండాలని భావిస్తుంటారు. అయితే కొందరు మాత్రం అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ మార్గాల్లో జనాలను ముంచే పనులు చేస్తుంటారు. పైకేమో ప్రముఖ పొలిటికల్ లీడర్లు, సామాజిక వర్గాల డైరెక్టర్లు. లోన మాత్రం అంతా చీకటి వ్యాపారం. మూడురోజుల క్రితం వైసీపీ మహిళా నేత, బొందిలి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టరు రసపుత్ర రజని నకిలీ నోట్ల చెలామణిలో బెంగళూరు పశ్చిమ విభాగం పోలీసులకు పట్టుబడ్డారు. రజనీతో పాటు ప్రొద్దుటూరుకు చెందిన చరణ్‌సింగ్, గోపినాధ్, అనంతపురం జిల్లాగా భావిస్తున్న రాజాను అరెస్టు చేశారు. వీరి నుంచి సుమారు రూ.11 లక్షల నకిలీ నోట్లు, వాటిని తయారు చేసే ప్రింటింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.