మాజీ మంత్రి, ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 31వ డివిజన్ పరిధిలోని సి ఆర్ పి క్వార్టర్స్ డౌన్ లో పర్యటించారు. స్థానిక ప్రజలు ఈ గడపగడపకి మన ప్రభుత్వం అనేది ప్రతి ఒక్క గడపకి ఎంతో ఉపయోగకరంగా ఉందని గడపగడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం జరుగుతూ ఉండాలని కోరుకుంటున్నామని తెలియజేశారు. డివిజన్ లోని మహిళలు, వృద్ధులు ఆఫీసుల చుట్టూ తిరగకుండా సమస్యలను ఎక్కడికి అక్కడే పరిష్కరిస్తున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.