రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మక్తమాధారం గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ధర్మకర్త వింజమూరి రామానుజాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. వేడుకను తిలికించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి పల్లకీసేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నిర్వాహకులు భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కల్యాణవేడుకు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.