గతానికి భిన్నంగా ఈ సారి పార్లమెంటు సమావేశాలు సాగనున్నాయి. దీంతో పార్లమెంట్ బడ్జెట్ సెషన్ జనవరి 31న ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. తొలుత భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి సెంట్రల్ హాల్‌లో ప్రసంగిస్తారు. దీంతో.. బడ్జెట్ సెషన్ ప్రారంభమైనట్లు సంకేతంగా భావిస్తారు. అయితే ఈసారి బడ్జెట్ సెషన్ తొలి రెండు రోజుల్లో అంటే జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జీరో అవర్, క్వశ్చన్ అవర్ నిర్వహించట్లేదని తెలిసింది. ఈ మేరకు శనివారం విడుదల చేసిన పార్లమెంటరీ బులెటిన్‌లో వెల్లడించింది.
ఇక ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతాారామన్.. లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆ తర్వాత రాజ్యసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 'రాష్ట్రపతి పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించే జనవరి 31న, బడ్జెట్ ప్రవేశపెట్టే ఫిబ్రవరి 1 తేదీల్లో క్వశ్చన్ అవర్, జీరో అవర్ ఉండదు' అని బులెటిన్‌లో పేర్కొన్నారు. ఏదైనా ముఖ్యమైన విషయాల గురించిన అంశాలపై ఫిబ్రవరి 2న జీరో అవర్‌లో చర్చకు తీసుకోనున్నట్లు వివరించింది.
జనవరి 31న చేసిన రాష్ట్రపతి ప్రసంగంపై.. ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 2న బదులిస్తారు. దీనిపై మోదీ మాట్లాడిన అనంతరం.. రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ బడ్జెట్ సెషన్ తొలి భాగం ఫిబ్రవరి 13 వరకు కొనసాగనుంది. బడ్జెట్ సెషన్ రెండో భాగం మార్చి 13 నుంచి ఏప్రిల్ 6 వరకు నిర్వహించనున్నారు. ఈ రెండో భాగంలో వివిధ మంత్రిత్వ శాఖలకు బడ్జెట్ కేటాయింపులపై చర్చ జరగనుంది.
సీనియర్లకు ఊతం.. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్.. వారికి మరింత బూస్ట్.. బడ్జెట్ అంచనాలివే!నరేంద్ర మోదీ నేతృత్వంలోని మోదీ 2.O. సర్కార్.. ప్రవేశపెట్టే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే. దీంతో ఈ బడ్జెట్‌పై ప్రజలకు చాలానే అంచనాలు ఉన్నాయి. అన్ని వర్గాల వారు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. రైతులు, మధ్యతరగతి ప్రజలు తమపై వరాల జల్లు కురుస్తుందని భావిస్తున్నారు. ఆదాయపు పన్ను గురించి కూడా ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటుందో ఎదురుచూడాలి. మరోవైపు రైల్వేకు భారీ కేటాయింపులు ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు. కొత్తగా 500 వరకు వందే భారత్ రైళ్లను ప్రకటించే అవకాశాలున్నాయి.