వందేభారత్ రైలు మార్గంలో ఫెన్సింగ్‌ను ప్రభుత్వం ప్రారంభించిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం తెలిపారు.కొత్తగా ప్రారంభించిన రైలు ప్రమాదాల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది అక్టోబర్‌లో ముంబై-గాంధీనగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గుజరాత్‌లోని అతుల్ స్టేషన్ సమీపంలో పశువులపైకి దూసుకెళ్లింది. ఒకే నెలలో రైలులో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోది. మళ్లీ డిసెంబర్ నెలలో అదే రైలు పశువులను ఢీకొట్టింది.ఇలాంటి ప్రమాదాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో రైలు వెళ్లే మార్గానికి కంచె వేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. దీంతో పశువులు ట్రాక్‌లపైకి చొరబడకుండా ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు.