హిమాచల్ ప్రదేశ్ లోని హవీపూర్ జిల్లాలో తాగునీరు కలుషితమైంది. ఈ నీరు తాగి 535 మంది అస్వస్థతకు గురయ్యారు. గ్రామాలకు నీటి పారుదల శాఖ పంపిణీ చేసిన నీటిలో భారీగా బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. నిర్మాణంలో ఉన్న ట్యాంక్ లో నిల్వ ఉన్న నీటిని శుద్ధి చేయకుండా అలానే పంపిణీ చేశారు. దీంతో నీరు కలుషితమైంది. కాగా, బాధితులంతా సీఎం సుఖ్వీందర్ సింగ్ సొంత నియోజకవర్గమైన నౌదాన్ కు చెందినవారు కావడం గమనార్హం.