దేశంలో ఈ ఏడాది జూన్ నుంచి 9-14 ఏళ్ల వయసు కలిగిన బాలికలను హెచ్‌పీవీ టీకా ఇవ్వనున్నారు. జాతీయ రోగనిరోధకత కార్యక్రమంలో భాగంగా ఈ టీకాను అందించేందుకు కేంద్ర సర్కార్ సన్నాహాలు చేస్తోంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణలో ఈ టీకా కీలకమైనది. ఈ టీకాకు సంబంధించి 16.02 కోట్ల డోసుల సరఫరా కోసం కేంద్ర ఆర్థికశాఖ ఏప్రిల్ నెలలో గ్లోబల్ టెండర్లను పిలవనుంది.