చలికాలం వచ్చిందంటే చాలు. చలికి తట్టుకోలేక వేడినీళ్లతో స్నానం చేస్తుంటారు. అయితే వేడినీళ్లతో స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. వేడి నీటితో స్నానం వల్ల చర్మంపై ప్రభావం పడుతుంది. వేడి నీరు చర్మంపై కెరాటిన్ కణాలను దెబ్బతీయడంతో పాటు చర్మంలోని మాయిశ్చరైజర్ తొలగిపోతుంది. వేడి నీటితో స్నానం చేయడం ద్వారా జుట్టు పొడిగా మారి, చుండ్రు సమస్య పెరుగుతుంది. అలాగే, వేడి నీటితో స్నానం వల్ల శరీరంలో రక్త ప్రసరణ వేగంగా జరుగుతుంది. వేగవంతమైన రక్త ప్రసరణ రక్తపోటుకు దారితీస్తుంది. స్నానం చేసే నీరు ఎక్కువగా వేడిగా ఉండకూడదని, గోరువెచ్చగా ఉంటే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.