దక్షిణాఫ్రికాలోని ఈస్టర్న్ కేప్ స్టేట్లో విషాదం చోటుచేసుకుంది. క్వాజాకెల్లోని ఓ ఇంటి యజమాని తన పుట్టినరోజును జరుపుకుంటుండగా చాలామంది అతిథులు విచ్చేశారు. ఇంతలో ఇద్దరు దుండగులు లోనికి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో పుట్టినరోజు జరుపుకుంటున్న ఇంటి యజమానితో సహా 8 మంది మృతి చెందారు. ఘటన అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.