జగనన్న చేదోడు పథకం కింద మూడో విడతగా రాష్ట్రవ్యాప్తంగా 3లక్షల 30వేల 145మందికి 330. 15కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ పథకం కింద అర్హులైన టైలర్లు, రజకులు, నాయిబ్రాహ్మణులకు ఒక్కొక్కరికి 10వేల రూపాయల సాయాన్ని పల్నాడు జిల్లా వినుకొండలో రిలీజ్ చేశారు. ఈపథకం కింద షాపులున్న 1లక్షా 67వేల 951 మంది టైలర్లకు రూ. 167. 95 కోట్లు, 1లక్షా 14వేల 661 మంది రజకులకు రూ. 114. 67కోట్లు, 45వేల 533 మంది నాయీ బ్రాహ్మణులకు రూ. 47. 53కోట్ల ఆర్థికసాయాన్ని బటన్ నొక్కి విడుదల చేశారు. వెనకబడిన కాదు వెన్నెముక కులాలు మారుస్తామని ఇచ్చిన మాట ప్రకారం నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటున్నామని తెలిపారు. ఎలాంటి వివక్ష లేకుండా లంచాలకు తావులేకుండా పారదర్శకంగా ఆర్థికసాయం చేస్తున్నామని ప్రకటించారు.