దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 170 పాయింట్లు లాభపడి 59,500 వద్ద ముగిసింది. నిఫ్టీ 45 పాయింట్లు పుంజుకుని 17,649 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : బజాజ్ ఫైనాన్స్ (4.61%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.51%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.22%), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (1.85%), ఎన్‌టిపిసి (1.53%).
టాప్ లూజర్స్ : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-3.38%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.56%), ఎల్ అండ్ టి (-2.11%), టాటా స్టీల్ (-1.62%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.55%).