మన ఆహార అలవాట్లు, జీవనశైలితో రక్తంలో మలినాలు పేరుకుపోతాయి. ఈ మలినాల కారణంగా చర్మ సమస్యలు మొదలవుతాయి. ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాలను చేర్చడం ద్వారా రక్తాన్ని శుభ్రపరచుకోవచ్చు. తులసి ఆకులు రక్తాన్ని శుద్ధి చేసే ఆక్సిజన్‌కు మూలం. ఇందులో ఉండే యాంటిసెప్టిక్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు అనారోగ్యాలను దూరం చేస్తాయి. వేప ఆకులను నమలడం వల్ల శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. రక్తంలోని మలినాలు తొలగిపోతాయి. బీట్ రూట్ లో ఉండే ఇనుము మరియు యాంటీఆక్సిడెంట్లు రక్తాన్ని శుభ్రపరుస్తాయి. పసుపులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులోని యాంటీసెప్టిక్ గుణాలు రక్తాన్ని శుభ్రపరుస్తాయి.