మైగ్రేన్ బాధితులు ఈరోజుల్లో చాలా ఎక్కువ అవుతున్నారు. ఆ సమస్యతో బాధ పడేవారు ఖచ్చితంగా తినే ఫుడ్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మైగ్రేన్ సమస్యతో బాధ పడేవారికి అరటిపండు చాలా మేలు చేస్తుంది. ఈ పండుని తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. ఇంకా అలాగే ఇందులో పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. డార్క్ చాక్లెట్ తినడం వల్ల మైగ్రేన్ వచ్చే ప్రమాదం ఉందని ఒక అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా మద్యం మాత్రం అసలు సేవించవద్దు. మైగ్రేన్ బాధితులు టీ, కాఫీలను అస్సలు తాగకూడదు. వీటిలో ఉండే కెఫిన్ మైగ్రేన్ సమస్యను పెంచుతుంది.