ఆ కార్యాలయంలో కొన్ని విభాగాల్లో దస్త్రం కదలాలంటే ముడుపు ఇచ్చుకోవాల్సిందేనన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. మున్సిపల్ ఆదాయాన్ని పెంపొందించాల్సిన రెవెన్యూ విభాగంలో కొంతమంది ఉద్యోగుల కారణంగా చెడ్డ పేరు తెచ్చిపెడుతున్నారు. హిందూపురం పట్టణంలో ఏడాదికేడాదికీ కొత్త భవనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇది వారికి వరంగా మారుతోంది. ఉమ్మడి జిల్లాలో అనంతపురం తరువాత హిందూపురం స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా కొనసాగుతోంది. ఈ కార్యాలయంలో పనిచేసే కొంతమంది ఉద్యోగులకు అధికార పార్టీలోని అన్నివర్గాల నాయకుల సహకారం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో వారు ఆడిందే ఆటగా తయారైందన్న విమర్శలు ఉన్నాయి.