వైసీపీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైసీపీ అధిష్టానం స్పందన కోసం కోటంరెడ్డి నిరీక్షిస్తున్నారట. వైసీపీ నుంచి స్పందన వచ్చిన తర్వాత వైసీపీకి ఆయన రాజీనామా చేసే ఛాన్స్ ఉందని సమాచారం. తాజా సమావేశాలపై డివిజన్ నేతలతో కోటంరెడ్డి సమావేశమయ్యారు. ఆగస్టు లేదా సెప్టెంబర్ లో ఆయన టీడీపీలో చేరుతారని, ఇప్పటికే దీనిపై చంద్రబాబు, లోకేష్ తో చర్చించినట్లు సమాచారం.