భారత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. సెంట్రల్హాలులో ఉభయసభల సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ప్రసంగిస్తున్నారు. రాష్ట్రపతి ప్రసంగం అయిన వెంటనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఆర్థిక సర్వేను సభ ముందుంచనున్నారు. దేశ ప్రగతిలో యువశక్తి, నారీశక్తి భాగస్వామ్యం కావాలని, పేదరికం లేని భారత్ నిర్మాణం జరగాలని ముర్ము తన తొలి ప్రసంగంలో పేర్కొన్నారు.