సీఎం ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుల విషయంలో 50 శాతం రాష్ట్ర వాటాను నిరాకరిస్తూ గత ‘మహా వికాస్ అఘాడి’ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. అదే సమయంలో రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల విషయంలో కేంద్రంతో పోరాడాలని ఎంపీలకు సీఎం మంగళవారం సూచించారు.