ఢిల్లీలో సీఎం జగన్ సందర్భం లేకపోయినా అప్రస్తుత ప్రసంగం చేశారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీరెడ్డి ఎద్దేవా చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసు మెడకు చుట్టుకున్న తరుణంలో ప్రజల దృష్టి మళ్లించడానికే విశాఖ రాజధాని అంటున్నాడని విమర్శించారు. సుప్రీంకోర్టులో కేసు ఉండగా విశాఖ రాజధాని అని ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. విశాఖ రాజధానిగా సీఎం జగన్ ప్రకటించడం ద్వారా హైకోర్టు తీర్పును తాను ఖాతరు చేసేది లేదన్న ధిక్కార స్వరాన్ని వినిపించినట్లుగానే భావించాలని సామాజిక ఉద్యమకారుడు టి.లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.