శ్రీకాకుళం జిల్లా, టెక్కలి పరిధిలోని భగవాన్పురం గ్రామ సమీప తోటల్లో పేకాట శిబిరంపై బుధవారం సిబ్బందితో దాడి చేసినట్టు ఎస్ఐ ఎల్.రామకృష్ణ తెలిపారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, వీరి నుంచి రూ.17,740 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.