కుప్పం రైల్వే స్టేషన్ కు మహర్దశ రాబోతుండటంతో కుప్పం ప్రజలు గురువారం ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైల్వేస్టేషన్ల అభివృద్ధికి అమృత్ భారత్ పథకాన్ని తీసుకువచ్చింది. అమృత్ భారత్ పథకం ద్వారా కుప్పం రైల్వేస్టేషన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వెయిటింగ్ హాల్స్, హోటల్స్, ప్లాట్ ఫాం విస్తరణ, రోడ్లు, పార్కింగ్, మెరుగైన లైటింగ్, కొత్త కార్యాలయాల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు. బెంగుళూరు చెన్నై ప్రధాన రైల్వే మార్గంలో కుప్పం రైల్వేస్టేషన్ ఉండటంతో రైల్వే అధికారులు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి అమృత్ భారత్ పథకంలో కుప్పం రైల్వేస్టేషన్ ను చేర్చారు.