విదేశంలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందిన పేద విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద నేడు తొలివిడత సాయాన్ని అందించనుంది. తొలివిడత కోసం ఎంపికైన 213 మంది విద్యార్థుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బు జమ చేయనుంది. సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి రూ.19.95 కోట్లు విద్యార్థుల ఖాతాల్లో జమచేస్తారు.