కేంద్ర బడ్జెట్ లో భాగంగా బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ పెంచుతున్నామని ప్రకటించిన నేపథ్యంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 పెరిగి రూ.53,600గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 పెరగడంతో రూ.58,470కి చేరింది. మరోవైపు వెండి ధర సైతం భారీగా పెరిగి, కిలో వెండి ధర రూ.77,800 పలుకుతోంది. ఏపీ, తెలంగాణల్లో ఇవే ధరలు అందుబాటులో ఉంటాయి.