పరిమిత ఓవర్లలో ఫామ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ టెస్టుల్లోనూ సత్తాచాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లో బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఉన్నందున మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ కోహ్లీకి ఓ సలహా ఇచ్చాడు. స్పిన్ బౌలింగ్ లో కొహ్లీ ఇబ్బంది పడుతున్నాడని, స్పిన్నర్లను దూకుడుగా ఎదురుకోవాలని అన్నాడు. ఈ సిరీస్ లో నాథన్ లయన్, ఆష్టన్ అగర్ స్పిన్ ను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై దృష్టి పెట్టాలని సూచించాడు.