కారును కొనుగోలు చేసేటప్పుడు అన్ని అంశాలను విశ్లేషించిన తర్వాత, మన అవసరాలకు సరిగ్గా సరిపోయే కారును ఎంపిక చేసుకోవాలి. కారును కొనుగోలు చేసే ముందు తనిఖీ చేయవలసిన 4 ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1.హెడ్‌లైట్లు
రాత్రి పూట ప్రయాణిస్తే కారుకు హెడ్‌లైట్‌ల అవసరం చాలా ఉంటుంది. మంచి హెడ్ లైట్ లను కలిగి ఉండటం వలన డ్రైవింగ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు. పగటిపూట కార్లను టెస్ట్ రైడ్ చేయడం వల్ల చాలా మంది హెడ్ లైట్స్ చెక్ చేయరు. కానీ తప్పకుండా చెక్ చేయాలి. కార్లలో ఇప్పుడు LED లైట్లు విలువైనవిగా మారాయి.
2.ఎయిర్ కండిషనింగ్
కార్లలో ఏసీ ఉందా లేదా చూడాలి. కార్లలో ఏసీ కెపాసిటీ ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. ఎండ మండిపోతున్నప్పుడు ఏసీ చాలా అవసరం. అందువల్ల కారు యొక్క ఎయిర్ కండిషనింగ్ ను పూర్తిగా తనిఖీ చేయండి.
3. పార్కింగ్
మీరు కారును కొనుగోలు చేయాలని నిర్ణయించుకుని, వేరియంట్ ఎంపికను పూర్తి చేసిన తర్వాత, అది పార్కింగ్ లో సరిపోతుందో లేదో మీరు ఎప్పుడైనా తనిఖీ చేశారా? మీ అవసరానికి అనుగుణంగా సీటు ఎత్తును సర్దుబాటు చేసి 4 వైపులా మీరు స్పష్టంగా చూడగలుగుతున్నారో లేదో చెక్ చేయండి. అలాగే పార్క్ చేయడానికి సులభమైన కారు కలిగి ఉండటం కూడా చాలా ముఖ్యం.
4.సీటు సౌకర్యం
మీరు మీ కారును టెస్ట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సైడ్ బోల్‌స్టరింగ్ మరియు కారు మొత్తం సీట్ కుషనింగ్ ను చెక్ చేయండి. సాధారణంగా ఇది మీరు ఎంచుకునే కారు రకాన్ని బట్టి ఉంటుంది కానీ చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది మీ డ్రైవింగ్ శైలి, అవసరానికి తగినది. వెనుక సీటు సౌకర్యాన్ని తనిఖీ చేయడానికి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్లండి. మీ కుటుంబ సభ్యులు తగినంత సౌకర్యవంతంగా ఉన్నారా లేదా మరియు క్యాబిన్ వెడల్పు తగినంతగా ఉండేలా చూసుకోండి.